నల్లమల పై విమానం చక్కర్లు
![Nallamala forest](https://www.achampeta.com/wp-content/uploads/2019/11/IMG-20191113-WA0000.jpg)
నల్లమల లో మంగళవారం మరొక్కసారి విమానం భూమికి అతి దగ్గరగా చక్కర్లు కొట్టి అందరిని భయాందోళనకు గురిచేసింది.యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వమని సీఎం కెసిఆర్ చెప్పినప్పటికీ అమ్రాబాద్ ప్రాంతంలో విమానం భూమికి దగ్గరగా తిరగడంతో ప్రజలు ఆందోళనకు గురిఅయ్యారు. మంగళవారం అమ్రాబాద్ మండలంలోని సార్లపల్లి,తిర్మలాపూర్,తాటిగుండాల మీదుగా తక్కువ ఎత్తులో విమానం తిరగడాని చూశామని ప్రత్యక్షసాక్షులు తెలియజేశారు.గత నెల15,25 తేదీల్లో కూడా ఇలాగే సాయంత్రం వేళలో విమానం తిరిగడం,అదే తరహాలో మంగళవారం సాయంత్రం కూడా తిరగడంతో యురేనియం సర్వే కోసమే అంటూ చర్చించుకుంటున్నారు.
అధికారులు దీని పై స్పందించి,ఆరా తీసి ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.