నల్లమల పై మరో పిడుగు
నల్లమల తన ఉనికిని కోల్పోయే ప్రమాదంలో వుందా? ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.జీవ వైవిధ్యానికి నిలయమైన నల్లమలలో యురేనియం నిక్షేపాలకు ఓ వైపు అన్వేషణ జరుగుతుండగానే మరో ఖనిజం వెలికితీతకు రంగం సిద్ధమవుతోంది.ఇప్పటికే నల్లమల అడవిలో సర్వే చేసిన రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ, అటవీశాఖ అధికారులు పెద్దఎత్తున క్వార్ట్‌జ్‌తో పాటు ఫెల్డ్ స్పార్ నిక్షేపాలను గుర్తించినట్లు సమాచారం.
వీటి వెలికితీతకు తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించింది.