నల్లమలలో మరోసారి కలకలం రేపిన హెలికాప్టర్ సర్వే
నల్లమలలో యురేనియం ప్రకంపనలు మళ్లి మొదలయ్యాయి. రాష్ట్రా ప్రభుత్వం అసెంబ్లీలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టిన తరువాత ప్రశాంత వాతావరణం ఏర్పడి సేద తీరుతున్న సమయంలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టి భయాందోళనకు గురి చేస్తున్నాయి.
అమ్రాబాద్ మండలంలోని
వట్వర్లపల్లి,సార్లపల్లి,తిర్మలపూర్,ఉడిమిళ్ళ,లక్ష్మాపూర్, పెట్రాల్ చేను ప్రాంతాలలో ఆకాశంలో నుండి భూమికి అతి దగ్గరగా తిరుగుతూ, మరియు హెలికాప్టర్ కు యాంటీనాలు ఉండడంతో యురేనియం సర్వే మళ్ళి చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసారు. గంట వ్యవధిలో నాలుగు సార్లు చత్రస్త్రాకారంలో చక్కర్లు కొట్టిన్నట్లు స్థానికులు తెలిపారు.దీనితో మళ్ళి భారీ పోరాటానికి నల్లమల వాసులు సిద్దం అవుతున్నారు.