నల్లమలలో తమిళనాడు ప్రజా సంఘాల నాయకుల పర్యటన
తమిళనాడు రాష్ట్రంలో జరిగిన అణురియాక్టర్ వ్యతిరేక పోరాట నాయకులు ఉదయ్ కుమార్ నల్లమలలో పర్యటించారు.ఈ సందర్భంగా యురేనియం తవ్వకాల వల్ల వచ్చే పర్యవసానాలు , జరిగే నష్టాన్ని గురించి కూలంకషంగా చర్చించారు. యురేనియాన్నికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం గురించి తెలుసుకున్నారు. కేంద్రం నుండి స్పష్టమైన ప్రకటన వెలువడే దాకా ఈ పోరాటం కొనసాగించాలని, ఈ పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.
ఈ పర్యటన లో కూడంకుళం పోరాట జాతీయ సంఘం అధ్యక్షులు సుందర్ రాజన్,కూడంకుళం పోరాట జాతీయ నాయకులు మీరా సంఘమిత్ర,జాతీయ ప్రజా ఉద్యమాల వేదిక ఆశాలత, మహిళా రైతు సంఘము నాయకులు,రాజకీయ జెఎసి అధ్యక్షుడు నాసరయ్య, బి.లింగం, అవుట రామకోటి, ఎం.పాండు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.