నల్లమలలోకి పర్యాటకులకు అనుమతి రద్దు
నల్లమలలోకి పర్యాటకులకు అనుమతి రద్దు
పెద్దపులుల సంరక్షణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.అమ్రాబాద్ టైగర్ రిజర్వు అడవుల్లో 17 పెద్దపులులు ఉండగా,కవ్వాల్ అడవుల్లో 4 పెద్ద పులులతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21ఉన్నాయి. రానున్న 3 నెలలు వన్య ప్రాణులకు ముఖ్యమైన రోజులని, ప్రధానంగా పెద్దపులులు జతకట్టె రోజులు కావున మనుషుల కదలికలను పూర్తిగా నిషేదీస్తూ అటవీశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
పులులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రతలు తీసుకున్నామని,కొత్త మనుషులు ఎవరైనావస్తే గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎవరైన సంచరిస్తే వాటి ఆధారంగా గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈమేరకు దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వు ప్రాంతమైన అమ్రాబాద్ అడవుల్లో జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు నల్లమలలోకి పర్యాటకులకు అనుమతి నిషేదిస్తూనట్లు పేర్కొన్నారు.