నగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు ఘనవిజయం సంధించారు.
అచ్చంపేట: సార్వ్రతిక ఎన్నికలలో నగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి శ్రీ. పోతుగంటి రాములు ఘనవిజయం సాధించారు. నల్లమల ముద్దుబిడ్డ కావడం తో ప్రజలు, నాయకులూ, కార్యకర్తలు, అభిమానులు, గులాబీ రంగులు చల్లుకున్నారు. నియోజక వర్గం లో వివిధ మండలాల్లో ప్రజలు ఉదయం 7 గంటల నుండే టివి ల కు అత్తుకుపోయారు. 11 గంటలకు మెజారిటీ పరంగా సంబరాలు, బాణాసంచా కాల్చడం మొదలుపెట్టారు. ఈ సందర్బంగా నాగర్కర్నూల్ ఎంపీ పి.రాములు మాట్లాడుతూ ఇది ప్రజలవిజయం అని కొనియాడారు నియెజకవర్గ ప్రజలకు తనను అత్యధిక మెజారితో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేసారు.