ధ్రువపత్రాల కోసం విద్యార్థుల పాట్లు…
ధ్రువపత్రాల కోసం విద్యార్థుల పాట్లు…..
విద్యా సంవత్సరం ప్రారంభమవడం విద్యార్థులు ,వారి తల్లిదండ్రులు తహసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
కళాశాలలు,స్కూల్స్ ,గిరిజన మరియు సంక్షేమ పాఠశాలలు మరియు కళాశాలలో చేరాలంటే విద్యార్థుల కుల ,ఆదాయ,స్థానిక సర్టిఫికెట్స్ తప్పని సరి కావడంతో మండల కార్యాలయానికి పోటెత్తారు.
గురుకులు మరియు రేసిడేన్శియల్లో సీట్లకు తీవ్రమైన పోటి ఉండడంతో ధ్రువపత్రాలు ఆలస్యం అయితే సీటు కోల్పోవలసి వస్తుందేమోనని బయపడు తున్నారు. సాధ్యమైనంత వరకూ అధికారులు అందుబాటులోనే ఉండి వారి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు అయినప్పటికి అప్పుడప్పుడు సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యం జరుగుతున్నాయి.
అలాగే రైతు బంధు మరియు ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకాలలో చేరాలంటే కొత్త పాస్ బుక్ లు తప్పని సరి కావడంతో కొత్తగా భూములు కొన్నవారు అలాగే కొన్ని కారణాలచేత బుక్ లు రానివారు కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టు ప్రదక్షిణాలు చేస్తుండడం కార్యాలయంలో సందడి వాతావరణం ఏర్పడింది.