ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ఉప్పునుంతల మండల కేంద్రంలో అచ్చంపేట ఎమ్మెల్యే విప్ గువ్వల బాలరాజు సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…వరి రైతులకు కనీస మద్దతు ధర అందజేయడానికి ప్రభుత్వం నుంచి వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ అవకాశాన్ని అందరు రైతులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కట్ట సరిత,జడ్పీటీసీ ప్రతాప రెడ్డి,తెరాస నాయకులు పాల్గొన్నారు.