దోమల నియంత్రణ చర్యలో అచ్చంపేట మునిసిపాలిటీ
అచ్చంపేట పట్టణంలో దోమల బెడద అధికం కావడంతో వాటి నియంత్రణ చర్యలకు మున్సిపాలిటీ అధికార యంత్రాంగం నడుంబిగించింది.
డెంగ్యూ, మలేరియా విజృంభిస్తుండడంతో వాటి కారకాలైన దోమల నియంత్రణ చర్యల్లో భాగంగా శనివారం సాయంత్రం పట్టణ వీధుల్లో మునిసిపల్ అధికారులు ఫాగ్గింగ్(దోమల పొగ) ఏర్పాటు చేశారు.