• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

దేవదూత మదర్ థెరీసా పుట్టిన రోజు సందర్భంగా

Share Button

మదర్ థెరీసా (ఆగష్టు 26, 1910 – సెప్టెంబర్ 5, 1997) ఆగ్నీస్ గోక్షా బొజాక్షు గా జన్మించిన అల్బేనియా దేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటీని భారతదేశంలోని కలకత్తాలో, 1950 లో స్థాపించారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత దేశంలో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు.

మానవతా వాది మరియు పేద ప్రజల మరియు నిస్సహాయుల అనుకూలు రాలిగా అంతర్జాతీయ కీర్తిని పొందారు.ఈమె తన మానవ సేవకు గాను 1979లోనోబెల్ శాంతి పురస్కారాన్ని మరియు 1980లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్నను పొందారు.మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృతమై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలను కలిగి, హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు మరియు క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను మరియు పాఠశాలలను స్థాపించింది.

ఆమె మరణానంతరం పోప్ జాన్ పాల్ IIచే దైవ ఆశీర్వాదం ( బీటిఫికేషన్)మరియు బ్లెస్డ్ తెరెసా అఫ్ కలకత్తా బిరుదు పొందారు.
ఆమె ఆగష్టు 26 న జన్మించినప్పటికీ, క్రైస్తవమతం స్వీకరించిన ఆగష్టు 27,ను తన నిజమైన జన్మదినంగా భావించే వారు.

1929 లో, ఆమె తన కొత్త శిష్యరికం ప్రారంభించడానికి భారత దేశంలో హిమాలయ పర్వతాల వద్ద నున్న డార్జిలింగ్ కి వచ్చారు. 1931 మే 24 లో ఆమె సన్యాసినిగా తన మొదటి మతప్రతిజ్ఞ చేసారు.మత ప్రచారకుల సంఘం పోషక సెయింట్ ఐన తెరేసే డి లిసే పేరు మీదుగా తన పేరును తెరెసాగా మార్చుకున్నారు. 1937 మే 14 లో తూర్పు కలకత్తాలోని లోరెటో కాన్వెంటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నపుడు తన పవిత్రప్రతిజ్ఞ చేసారు.

పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఆనందించినప్పటికీ, కలకత్తా చుట్టుపక్కల పేదరికం ఆమెను కదిలించి వేసింది. 1943 లో ఏర్పడిన కరువు కలకత్తా నగరానికి కష్టాలను మరియు మరణాలను తీసుకు వచ్చింది మరియు ఆగష్టు 1946 లో ఏర్పడిన హిందూ/ముస్లిం హింస నగరాన్ని నిరాశ మరియు భయాందోళనలకు గురిచేసింది.

1946 సెప్టెంబర్ 10,లో తెరెసా తన సాంవత్సరిక విరామంలో భాగంగా కలకత్తానుండి డార్జిలింగ్ లోని లోరెటో కాన్వెంటుకు ప్రయాణం చేస్తున్నపుడు తాను “పిలుపులో పిలుపు”గా పొందిన అనుభవాన్ని గుంరించి తెలియ చేసారు. నేను కాన్వెంటును వదిలి పేదల మధ్య నివశిస్తూ వారికి సేవ చేయాలి.ఇది ఒక ఆజ్ఞ.దీనిని పాటించకపోతే విశ్వాసాన్ని కోల్పోయినట్లే. 1948 లో ఆమె తన సాంప్రదాయ లోరెటో అలవాటును వదిలి నిరాడంబరమైన, నీలపు అంచుగల తెల్లటి నూలు చీరను ధరించి, భారత పౌరసత్వము స్వీకరించి మురికి వాడలలో ప్రవేశించారు.ఆమె మొదట మొతిజిల్ లో ఒక పాఠశాలను స్థాపించారు; అటు వెంటనే అనాథల మరియు అన్నార్తుల అవసరాలను తీర్చ సాగేరు. తొందరలోనే ఆమె కార్యక్రమాలు అధికారుల దృష్టిని ఆకర్షించడంతో పాటు ప్రధానమంత్రి ప్రశంసలు అందుకునేలా చేసాయి.

తెరెసా తన డైరీలో తన తొలి సంవత్సరం కష్టాలతో నిండి ఉన్నట్లుగా వ్రాసుకున్నారు.ఆమెకు ఆదాయం లేకపోవడం వలన ఆహారం మరియు ఇతర సరఫరాల కొరకు యాచించవలసి వచ్చేది.

మదర్ థెరీసా వ్రాసిన వాక్యాలు:
“మా దేవుడు నన్ను పేదరికం అనే శిలువతో కప్పబడిన స్వేచ్ఛా సన్యాసినిగా వుండమంటున్నాడు. నేను ఈరోజు మంచి పాఠం నేర్చుకున్నాను. పేదల బీదరికం వారికి చాలా కష్టంగా వుండివుండాలి. ఒక ఇల్లు కొరకు వెతుకుతూ నా కాళ్లు చేతులు నొప్పిపుట్టేంతవరకూ నడిచాను. పేదవారు ఇంటికొరకు, ఆహారం మరియు ఆరోగ్యం కొరకు వెతుకుతూ శరీరంలోను మరియు ఆత్మలోను ఎంత బాధపడుతున్నారోనని అనుకున్నాను. అప్పుడు లోరెటో లో నున్న సుఖప్రధమైన జీవితం నన్ను లాలసకు గురిచేసింది. నీవు ఒక్క మాటంటే చాలు మరల ఆ పాత జీవితం మరలం నీదవుతుందని నన్ను లోంగదీసుకోనే గొంతు చెప్తున్నది. నా స్వేచ్ఛమైన మనస్సుతో దేవుడా, నీపై ప్రేమతో, నేను ఇక్కడే వుంటాను.నాగురించి నీ పవిత్ర ఇష్టాన్ని నెరవేరుస్తాను. నేను ఒక కన్నీటిబొట్టు కూడా రానివ్వలేదు.”

1950 అక్టోబరు 7 ఆమె వాటికన్ అనుమతితో మతగురువుల సంఘాన్ని ప్రారంభించారు అదే తరువాత మిషనరీస్ అఫ్ ఛారిటీగా రూపొందింది. ఆమె మాటలలో “ఆకలిగొన్న వారల, దిగంబరుల, నిరాశ్రయుల, కుంటి వారల,కుష్టు వ్యాధి గ్రస్తుల, అందరూ త్యజించారని భావించే వారల, ప్రేమించబడని వారల, సమాజంచే నిరాకరింపబడిన వారల, సమాజానికి భారమైన వారల మరియు అందరిచే విసర్జింపబడిన వారల “ను జాగ్రత్తగా చూడడమే ఈ సంఘం యొక్క కర్తవ్యం. ఇది కలకత్తాలో స్వల్ప స్థాయిలో 13 మంది సభ్యులతో మొదలైంది;నేడు ఇది 4,000 కు పైగా సన్యాసినులను కలిగి అనాథ శరణాలయాలు, ఎయిడ్స్ ధర్మశాలలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తూ, శరణార్ధులకు, అంధులకు, అంగవికలురకు, వృద్ధులకు, మద్యపాన గ్రస్తులకు, బీదవారికి మరియు నిరాశ్రయులకు, వరద బాధితులకు, అంటువ్యాధులు మరియు కరువు బాధితులకు సహాయం చేస్తోంది.

భారతదేశ అధికారుల సహాయంతో ఆమె ఒక పాడుబడినహిందూ దేవాలయాన్ని పేద ప్రజల ధర్మశాలగా మార్చారు.ఆమె దానికి కాళీఘాట్ పరిశుద్ధ హృదయ నిలయం ( కాళీఘాట్ హోం ఫర్ ది డయింగ్) (నిర్మల్ హృదయ్) గా పేరు పెట్టారు .ఈ నిలయానికి తీసుకురాబడిన వారికి వైద్య సహాయాన్ని అందించి, వారి నమ్మకాల ప్రకారం ఆచార కర్మల ననుసరించి గౌరవంగా చనిపోయే అవకాశం కల్పించారు. ముస్లింలు ఖురాన్ చదివేవారు, హిందువులకు గంగా జలం అందించేవారు, కాథలిక్స్ కు వారి ఆచారం ప్రకారం అంత్యక్రియలు జరుపబడేవి.ఆమె మాటలలో అది “ఒక అందమైన చావు”, “జంతువులలా బ్రతికిన మనుష్యులకు దేవతల వంటి చావును కల్పించడం-ప్రేమతో మరియు అక్కరతో.” ఆ వెంటనే మదర్ థెరీసా సాధారణంగా కుష్టు వ్యాధిగా పిలువబడే హాన్సెన్ వ్యాధి గ్రస్తులకు శాంతి నగర్ అనే పేరుతో ధర్మశాలను ఏర్పాటు చేసారు.మిషనరీస్ అఫ్ ఛారిటీ కుష్టు వ్యాధిని అధిగమించుట కొరకు కలకత్తా నగరవ్యాప్తంగా వైద్యశాలలను ఏర్పాటు చేసి, వైద్యాన్ని, కట్టు కట్టడానికి అవసరమైన వస్త్రాలను మరియు ఆహారాన్ని అందచేసింది.
ఈ సంస్థ త్వరలోనే అనేకమంది కొత్త వ్యక్తులను మరియు విరాళాలను ఆకర్షించింది, 1960 నాటికి భారతదేశ వ్యాప్తంగా అనేక ధర్మశాలలను, అనాథ శరణాలయాలను, మరియు కుష్టు వ్యాధి గ్రస్తులకేంద్రాలను ఏర్పాటు చేసింది.మదర్ థెరీసా తన సంస్థలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు.

2007 నాటికి మిషనరీస్ అఫ్ ఛారిటీ ప్రపంచవ్యాప్తంగా 450 మంది సన్యాసులను మరియు 5,000 మంది సన్యాసినులను కలిగి, 600 శాఖలను నిర్వహిస్తూ, 120 దేశాలలో పాఠశాలలను, ఆశ్రయాలను కలిగి ఉంది.
ఆమె సాధించిన కార్యాలను, కృత్యాలను విశ్లేషిస్తూ జాన్ పాల్ II ఈ విధంగా ప్రశ్నించారు:”ఇతరుల సేవకై తనను వినియోగించుకొనే శక్తినీ పట్టుదలనూ మదర్ థెరీసా ఎక్కడ నుండి పొందుతారు?ఆమె దానిని తన ప్రార్థనలో మరియు యేసు క్రీస్తు యొక్క నిశ్శబ్దధ్యానంలో, ఆయన పావన వదనంలో, పవిత్ర హృదయం లో పొందుతారు.”

తనలోతనకి మదర్ థెరీసా యాభైసంవత్సరాల పాటు, తన జీవితపర్యంతం మతపరమైన తన నమ్మకాలపై సందేహాలను మరియు ప్రయాసలను వ్యక్తం చేసారు, ఈక్రమంలో “ఆమె దేవుడనేవాడు లేడని భావించారు”, “ఆమె హృదయంలోనే కాదు కృతజ్ఞతలో కూడా” అని ఆమె ప్రతిపాదకుడు (ఆమె పవిత్రీకరణకు ఆధారాలు సేకరించేందుకు బాధ్యుడైన అధికారి) రెవ.బ్రయాన్ కోలోదిఎజ్చుక్ అన్నారు. మదర్ థెరీసా దేవుని ఉనికిపై ఉపేక్షింపరాని సందేహాలను వెలిబుచ్చారు మరియు తన అవిశ్వాసానికి బాధను వ్యక్తం చేసారు.

దేవుడు తన ద్వారా సేవ చేయిస్తున్నాడనే ఆమె భావం చెరిగి పోనిది, ఆమె దేవుని ఉనికిని ప్రశ్నించక ఆయనతో తన బంధాన్ని నిలుపుకోవడానికి పరితపించింది అని వ్యాఖ్యానించారు.

1983 లో పోప్ జాన్ పాల్ II సందర్శనార్ధం మదర్ థెరీసా, రోమ్ వెళ్ళినప్పుడు గుండెపోటుకు గురయ్యారు. 1989 లో రెండవసారి గుండెపోటుకు గురైనపుడు ఆమెకు కృత్రిమ పేస్ మేకర్ ను అమర్చారు. 1991 లో మెక్సికోలో న్యుమోనియాతో పోరాడుతున్నపుడు ఆమె మరిన్ని హృదయ సమస్యలను ఎదుర్కున్నారు. మిషనరీస్ అఫ్ ఛారిటీ అధినేత పదవికి ఆమె తన రాజీనామాను సమర్పించారు.కానీ సంస్థ లోని సన్యాసినులు రహస్య ఎన్నిక ద్వారా ఆమె కొనసాగాలని కోరారు. సంస్థ అధిపతిగా కొనసాగడానికి మదర్ థెరీసా అంగీకరించారు.

ఏప్రిల్ 1996,లో మదర్ థెరీసా క్రిందపడటం వలన ఆమె మెడ ఎముక విరిగింది.ఆగస్టులో ఆమె మలేరియాతో బాధ పడటంతో పాటు గుండె ఎడమభాగంలోని జఠరిక(గుండె) పనిచేయడం మానివేసింది.ఆమెకు గుండె శస్త్రచికిత్సజరిగింది, కానీ ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్న విషయం వెల్లడైంది. తాను అనారోగ్యం పాలైనపుడు తన వైద్యశాలలలో ఏదో ఒక దానిలో చికిత్స పొందకుండా, కాలిఫోర్నియాలో అన్ని హంగులతో కూడిన వైద్యశాలను ఎంచుకొనడం వివాదాలకు దారితీసింది. మార్చి 13, 1997 న ఆమె మిషనరీస్ అఫ్ ఛారిటీ అధినేత పదవి నుండి వైదొలిగారు, 1997 సెప్టెంబర్ 5 న మరణించారు.

ఆమె చనిపోయే నాటికి మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ 4,000 సన్యాసినులు, 300 మంది అనుబంధ సోదర సభ్యులు, మరియు 100,000 పైగా సాధారణ కార్యకర్తలను కలిగి, 123 దేశాలలో 610 శాఖలను కలిగి ఉంది. వీటిలో ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నవారి సంరక్షణ గృహాలు మరియు హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు వ్యాధి మరియు క్షయ రోగులకు ఆవాసాలు,ఆహారకేంద్రాలు, అనాథ శరణాలయాలు, మరియు పాఠశాలలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat