దాసరి నాకు తాత అవుతారు

0
achampeta - Entertainment news

ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఎంతో మంది దర్శకుల శ్రమ ఫలితం వల్లే ఓ హీరో రూపుదిద్దుకుంటాడు. ఎంతో గొప్ప ప్రతిభా పాటవాలున్న దాసరిగారి జన్మదినం రోజుని ‘డైరెక్టర్స్‌ డే’గా ప్రకటించి, జరుపుకోవటం నిజంగా దర్శకుల అదృష్టం’’ అన్నారు నటుడు చిరంజీవి. మే 4 దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి. ఈ సందర్భంగా శనివారం తెలుగు దర్శకుల సంఘం ఆధ్వర్యంలో ‘డైరెక్టర్స్‌ డే’ వేడుక జరిగింది. ఇందులో దాదాపు 300 మంది దర్శకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా చిరంజీవి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *