దారులన్నీ అటు వైపే

శ్రీశైలంలో శనివారం సందర్శకుల తాకిడి పెరిగింది. పాఠశాలలకు,ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీస్ వరుసగా మూడు రోజులు సెలవులు ఉండడం,శ్రీశైలం డ్యాం వద్ద 10 గేట్లు తెరవడంతో జనాల తాకిడి అధికంగా ఉంది.
డ్యాం వద్ద సందర్శకులతో సందడి వాతావరణం నెలకొంది. శనివారం మన్ననూర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.అలాగే డ్యాం వద్ద వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీస్ సిబ్బంది పర్యాటకుల పర్యవేక్షణ చేస్తూ జాగృత పరుస్తున్నారు, సోమవారం సాయంత్రం వరకు ఈ తాకిడి వుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.