దాచిపెడితే దాగే నిజాలు కావు ఇవి!

0
History of independence for india

History of independence for india
*ప్రముఖ జర్నలిస్ట్ కుష్వంత్ సింగ్ ఇలా అంటున్నారు:*

“భారత స్వాతంత్రం ముస్లింల రక్తంతో రాయబడింది. ముస్లింల జనాభా శాతం కన్నా స్వాతంత్ర పోరాటంలో వారి భాగస్వామ్య శాతం చాలా ఎక్కువ.”

ఇండియా గేట్ మీద “95,300” మంది స్వాతంత్ర సమర యోధుల పేర్లు రాయబడి వున్నాయి. వాటిలో “61,945” ముస్లిం పేర్లే. అంటే స్వాతంత్ర సమర యోధుల్లో 65% ముస్లింలు.

భారత స్వాతంత్ర పోరాటం కోసం ముస్లింలు చేసిన త్యాగాలను ఉద్దేశ పూరితంగానే దాచటం జరుగుతోంది. ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూస్తే ఆ వాస్తవాలు ఏమిటో ఇట్టే అర్థమవుతాయి.

దాచిపెడితే దాగే నిజాలు కావు ఇవి. లెక్కకు మించిన ఈ వాస్తవాలను ప్రతి ముస్లిం తెలుసుకోవాలి. తమ పిల్లలకు వాటి గురించి తెలియజెప్పాలి. దయచేసి ఈ వ్యాసాన్ని పూర్తిగా చదవండి, మీకు తెలిసిన ప్రతి భారతీయునికి ఈ సందేశాన్ని చేరవేయండి.

తొలి స్వాతంత్ర పోరాటం

భారత స్వాతంత్రం కోసం బ్రిటీషువారిపై మొట్టమొదటగా కదం తొక్కినది *హైదర్ అలీ * మరియు అతని కుమారుడు *టీపు సుల్తాన్.* 1780 మరియు 1790లోనే ఈ తండ్రీ కుమారులు ఇద్దరు బ్రిటీషువారిపై జరిగిన యుద్ధాల్లో భారత చరిత్రలోనే తొలిసారిగా ఇనుముతో తయారైన “మైసూరియన్ రాకెట్లు” మరియు ఇనుప గుండ్ల (తోపుల)ను విజయవంతంగా ప్రయోగించారు.

తన రాజ్యం తన దత్త పుత్రునికి సంక్రమించాలన్న పట్టుదలతో బ్రిటీషువారిపై ఝాన్సీ రాణి యుద్ధం చేసిందని మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. కాని *బేగం హజ్రత్ మహల్* 1857 జూన్ 30 న ప్రప్రథమ స్వాతంత్ర పోరాటంలో చిన్‍హట్ వద్ద బ్రిటీష్ పాలకుడు సర్ హెన్రీ లారెన్స్ ను తుపాకీతో కాల్చి చంపి బ్రిటీషు సైన్యాలను చిత్తు చిత్తుగా ఓడించిందని మనలో ఎంతమందికి తెలుసు?

ప్రప్రథమ స్వాతంత్ర పోరాటాన్ని ఆర్గనైజ్ చేసింది, నాయకత్వం వహించింది *”మౌల్వీ అహ్‍మదుల్లాహ్ షాహ్”* అన్న విషయం మీకు తెలుసా? అప్పట్లో ఎంతోమంది అమరులయ్యారు. వాళ్ళల్లో 90% ముస్లింలే.

బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నిన నెపం మీద 27 యేండ్ల వయసులో ఉరి కొయ్యను ముద్దాడిన మొట్టమొదటి అమరవీరుడు *”అష్ఫాఖుల్లా ఖాన్”*

*మౌలానా అబుల్ కలామ్ ఆజాద్* భారత దేశంలో జన్మించిన ఒక గొప్ప మేధావి. స్వాతంత్ర పోరాట కాలంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‍లో సీనియర్ ముస్లిం నాయకులు. ఆనాడు గాంధీ గారితో పాటు సారా షాపులకు వ్యతిరేకంగా జరిపిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న 19 మందిలో 10 మంది ముస్లింలే.

చిట్ట చివరి మొగల్ చక్రవర్తి *బహదూర్ షాహ్*- బ్రిటీష్ వారిపై తెగింపుతో పోరాడిన స్వదేశీ రాజు. ఈయన ప్రయత్నాలే 1857లో ప్రప్రథమ స్వాతంత్ర పోరాటానికి నాంది పలికాయి. బహదూర్ షాహ్ సమాధిపై రాజీవ్ గాంధీ ఇలా రాశారు:
“(బహదూర్ షాహ్!) మీరు ఇండియాలో కాసింత చోటుకి కూడా నోచుకోలేక పోయారు. కాని మా మనసుల్లో మీకు చోటుంది. మీ పేరు చిరస్మరణీయం. ప్రప్రథమ భారత స్వాతంత్ర యుద్ధ స్మారక చిహ్నం ముందు నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను….”

*M.K.M అమీర్ హంజా* – ఇండియన్ నేషనల్ ఆర్మీ కోసం తన ఎన్నో లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. ఆయన కుటుంబీకులు ఇప్పుడు చాలా పేదరికంలో తమిళనాడులోని రామనాధపురంలో ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.

*మేమన్ అబ్దుల్ హబీబ్ యూసుఫ్ మర్ఫానీ* – తన సంపద మొత్తం దాదాపు ఆనాటి కోటి రూపాయలు నేతాజీ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA)కు దానం చేసేశారు.

*షాహ్ నవాజ్ ఖాన్* ఒక సిపాయి. ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఛీఫ్ ఆఫీసర్, కమాండర్. నేతాజీకు 19 మంది మంత్రులు ఉండేవారు. వారిలో 5గురు ముస్లింలే.

*బీవమ్మ* అనే ముస్లిం తల్లి భారత స్వాతంత్ర పోరాటం కోసం ఆనాడే 30 లక్షలకు మించి విరాళం ఇచ్చింది.

మూడు రంగుల మన జాతీయ పతాకాన్ని డిజైన్ చేసినది ఓ ముస్లిం వనిత – *సురయ్యా త్యాబ్‍జీ.*

భారత స్వాతంత్ర పోరాటం కోసం ముస్లింలు తమ మస్జిదులనే స్థావరాలుగా ఉపయోగించారు. ఉత్తర ప్రదేశ్‍లోని ఒక మస్జిద్‍లో ఇమామ్ గారు స్వాతంత్ర పోరాటం గురించి ఉపన్యాసం ఇస్తుండగా బ్రిటీష్ సైన్యం మస్జిద్‍లో వున్నవారిపై విచ్చలవిడిగా కాల్పులు జరిపింది. అప్పుడు చిందిన ఆ స్వాతంత్ర సమర యోధుల నెత్తుటి ఎండిన చారలు నేటికీ ఆ మస్జిద్ గోడలపై మనం చూడవచ్చు. ముస్లింలు భారత దేశాన్ని 800 సంవత్సరాలు పాలించారు. కాని బ్రిటీష్, డచ్చ్, ఫ్రెంచ్ వారి లాగా వారు ఇక్కణ్ణుంచి ఏమీ దోచుకెళ్ళలేదు.

ముస్లింలు ఇక్కడే బ్రతికారు. పరిపాలించారు. ఇక్కడే చచ్చారు. వారు భారత దేశాన్ని అభివృద్ధి చేశారు. చిన్న చిన్న రాజ్యాలను ఐక్యం చేసి ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఈ దేశ పేరు ప్రఖ్యాతులు ప్రపంచంలో మారు మోగేలా చేశారు. విద్య, సాహిత్యం, కళలు, భవన నిర్మాణ రంగాల్లో భారత దేశం యావత్ ప్రంపంచానికి కేంద్రం అయింది. న్యాయ, రాజకీయ, ప్రభుత్వం, పరిపాలనా, నిర్వహణ వ్యవస్థల్ని అభివృద్ధి చేశారు. భారత పరిపాలనలో నేటికీ అవే నడుస్తున్నాయి.

తమిళనాడులో ఇస్మాయీల్ సాహెబ్ & మరుదా నాయగం అనే ఇద్దరు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా 7 సంవత్సరాలు కంటిన్యూగా పోరాడారు. వారి పేర్లు వింటేనే బ్రిటీష్ వారు హడలెత్తి పోయేవారు.

*V.O.C (కప్పలోతియ తామిల్‍జన్)* – భారత స్వాతంత్ర పోరాటంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ఓడ నడిపిన మొట్టమొదటి నావికుడు. ఇతని గురించి అందరికి తెలుసు. కాని అతను నడిపిన ఓడ *ఫకీర్ ముహమ్మద్ రౌథర్* విరాళంగా ఇచ్చినది అని ఎందరికి తెలుసు?

VOC అరెస్ట్ అయినప్పుడు అతన్ని విడుదల చేయమని *ముహమ్మద్ యాసీన్* అనే సమర యోధుడు ధర్నా చేసినందుకు బ్రిటీష్ పోలీసులు అతన్ని షూట్ చేసి చంపారు.

తిరుప్పుర్ కుమారన్ (“కోడికట కుమారన్”) స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. కుమారన్‍తో పాటు మరి ఏడుగురు అరెస్ట్ అయ్యారు. వారందరూ ముస్లింలే. * అబ్దుల్ లతీఫ్, అక్బర్ అలీ, మొహిద్దీన్ ఖాన్, అబ్దుల్ రహీం, వావు సాహెబ్, అబ్దుల్ లతీఫ్, షేఖ్ బాబా సాహెబ్.*

స్వాతంత్ర పోరాటంలో ముస్లింల త్యాగాల గురించి వేల పేజీల పుస్తకాలు రాయవచ్చు. కాని దురదృష్టవశాత్తూ దేశంలో ఆధిపత్యం వహిస్తున్న హిందు మత దురభిమానులు, జాత్యహంకారులు ఈ నిజాలను దాచేస్తున్నారు. చరిత్ర పుస్తకాల్లో చరిత్రను వక్రీకరించి రాస్తున్నారు. ఓట్ల కోసం చరిత్రను తిమ్మిని బమ్మి చేసి చూపిస్తున్నారు. దేశభక్తి గల ఇండియన్లు వీరి పట్ల కడు జాగ్రత్తగా ఉండాలి. స్వార్థ రాజకీయ నాయకుల ఉచ్చులో పడకుండా దృఢమైన, ప్రగతిశీల జాతి నిర్మాణం కోసం దేశ పౌరులందరిని ఏకం చేసే దిశగా పని చేయాని.

ఈ వ్యాసం ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా రాసినది కాదు.

హిందూ – ముస్లింల ఐక్యత కోసం ఓ మేధావి కలం నుండి జాలువారిన సత్య సందేశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *