దక్షిణాఫ్రికాపై పుణె టెస్టులో ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో ఘన విజయం
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 137 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 601 పరుగులతో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సమాధానంగా దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి తన తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు ఆలౌట్ అయింది.
దీంతో భారత్‌కు 326 పరుగుల ఆధిక్యత లభించింది. ఫలితంగా ఆదివారం నాలుగో రోజు ఫాలోఆన్ ఆడాల్సి వచ్చిన దక్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే ఆలౌట్ కావడంతో మ్యాచ్‌తో పాటుగా సిరీస్‌ను కూడా దక్కించుకుంది. నాలుగో రోజు ఆటలో భారత బౌలర్లు చెలరేగిపోవడంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ టీ బ్రేక్ తర్వాత ముగిసింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో డీన్ ఎల్గర్ (48),బావుమా (38), ఫిలాండర్ (37),మహరాజ్ (22)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగా మిగతా వారంతా ఘోరంగా విఫలమైనారు. దాంతో కోహ్లీ సేన ఇన్నింగ్స్ 137 పరుగులతో భారీ విజయం సాధించింది.