దంచి కొట్టిన వానతో.. ట్రాఫిక్ లో చిక్కుకున్న మంత్రి కేటీఆర్
భాగ్యనగరంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నిన్న కుండపోతగా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం,ద్రోణి ప్రభావంతో రానున్న 48 గంటల్లో హైదరాబాద్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోపక్క హికా తుఫాన్ ముంచుకొస్తున్నట్లు గా తెలుస్తోంది. దీంతో భాగ్యనగర్ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. వర్ష ప్రభావంతో ట్రాఫిక్ జామ్ కాగా మంత్రి కేటీఆర్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు.