త్వరలో వచ్చే మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం
నాగర్కర్నూల్ జిల్లాలో అసెంబ్లీ, సర్పంచ్, ఎంపీ, పరిషత్ ఎన్నికలు విజయవంతంగా ముగిసినాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం లో మున్సిపల్ ఎన్నికల గురించి చర్చించారు .
దింతో ప్రభుత్వం మరియు నాయకులూ వచ్చే నెలలో ఎన్నికలు ఉంటాయని అంచనా వేస్తున్నారు మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం జూలై 3వ తేదీతో ముగియనున్నాయి.గతం లో విలీన గ్రామాల పైన కొంత వ్యతిరేకత ఉన్న హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం తో ఆ సమస్య ముగిసిపోయింది. మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రస్తుతానికి ఎటువంచి ఇబ్బందులు లేవు.
జిల్లాలో నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట మున్సిపాలిటీలు ఉన్నా అచ్చంపేటలో మార్చి 2016లోనే ఎన్నికలు జరగడంతో అక్కడి పాలకవర్గానికి ఇంకా రెండేళ్ల గడువు ఉండడంతో మిగిలిన మూడు మున్సిపాలిటీలలో నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.