తెలుగువారి బోనాల మహోత్సవం

తెలుగు,ముదిరాజ్ కులస్తుల బోనాలు ఆదివారం ఘనంగా జరిగాయి.ముదిరాజుల కులదైవం అంకాలమ్మ తల్లికి ఉదయం ఘనంగా పూజలు నిర్వహించిన అనంతరం జనం బోనాలను ఊరేగింపుగా తీసుకొని బోడ్రాయి వద్ద పూజలు నిర్వహించి ఆలయానికి చేరారు.అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి దర్శనం చేసుకున్నారు.పోలీసులు భద్రత ఏర్పాట్లు చూడగా ఆలయ కమిటీ భక్తులకు ఏర్పాట్లు చేశారు.
రాత్రి 11 గంటలకు భజన పారాయణం ప్రారంభం కానుంది. రంగం కార్యక్రమం రేపు ఉదయం ఉంటుందని, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు.