తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర యువజన విభాగం కార్య నిర్వహక అధ్యక్షులుబండపల్లి మల్లేష్
నియామక పత్రం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, కీ.శే. శ్రీ పివి రావు గార్ల ఆశయాలకు అనుగుణంగా దళితుల చైతన్యానికి, ఐక్యతకు కృషి చేస్తున్న బండపల్లి మల్లేష్ s/o వెంకటయ్య R/o అచ్చంపేట గారిని తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర యువజన విభాగం కార్య నిర్వహక అధ్యక్షులు(youth wing working president)గా నియమించనైనది.
తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు శ్వేతపత్రం విడుదల చేస్తూ…..తెలంగాణ మాలమహానాడు సిద్ధాంతాలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ దళితుల చైతన్యం, ఐక్యమత్యంతో పాటుగా వెనుకబాటుకు గురికాబడిన మాలలు మరియు దళితుల అభివృద్ధికి కృతనిశ్చయంతో పనిచేస్తారని అభిలాషించారు.
అలాగే యువజన విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమింపబడిన బండపల్లి మల్లేష్ గారికి ఉద్యమ అభినందనలు తెలియజేశారు.