తెలంగాణ అధ్యాపకుల ఫోరం (టిఎల్ఎఫ్)
తెలంగాణ అధ్యాపకుల ఫోరం (టిఎల్ఎఫ్) ఆధ్వర్యంలో 25-7-2019 (గురువారం) నాడు మధ్యాహ్నం మూడు గంటలకు టీఎన్జీవో భవన్లో ‘నూతన జాతీయ విద్యా మిషన్ 2019’ పై రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది. నూతన విద్యావిధాన కమిషన్ 2019 పై చర్చ ఉంటుంది.
దీనిలో టిఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కత్తి వెంకటస్వామి, విద్యావేత్త,రిలీవుడ్ ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కరరావు పాల్గొంటారు. స్థానిక ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ప్రతినిధులు, మేధావులు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని టిఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామకృష్ణయ్య కోరారు.ఈ సమావేశం టిఎల్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్,టిఎల్ఎఫ్ జిల్లా జనరల్ సెక్రటరీ పాష మరియు శివకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించబడునని తెలియజేశారు.