తెలంగాణలో నీలి విప్లవం
మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన చేప పిల్లల పంపిణీ పథకాన్ని ప్రభుత్వం నేడు ప్రారంభించనుంది. కుంటలు,చెరువులు నిండడంతో
నీటి వనరుల్లో చేపపిల్లల విడుదలకు ఇదే మంచి సమయమని భావిస్తున్న సర్కారు నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ చేపడుతోంది. తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేపపిల్లలను వదిలి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.