తెలంగాణకు కొత్త గవర్నర్.. రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారం
తెలంగాణ కొత్త గవర్నర్ కొలువు దీరారు. రాష్ట్రానికి రెండో గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహన్ ఆమెతో ప్రమాణం చేయించారు. అనుకున్న సమయానికి ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కేసీఆర్, పలువురు రాష్ట్ర మంత్రులు, విపక్ష నేతలు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ కొత్త గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తదితర నేతలు హాజరయ్యారు. తమిళనాడు డిప్యూటీ సీఎం, మంత్రులు కూడా హాజరయ్యారు.