తెరాస బైక్ ర్యాలీ ప్రారంభం
యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని స్వాగతీస్తూ అచ్చంపేట క్యాంపు కార్యాలయం నుండి పదర వరకు బైక్ ర్యాలీని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రారంభించారు.
అంబెడ్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ… అపోహలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వాళ్లకు ఈ తీర్మానం చెంపపెట్టు అన్నారు.
మేము కేవలం సర్వే కి మాత్రమే అనుమతులు ఇచ్చామని, తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
పోలీసుల బారి భద్రత నడుమ ఈ ర్యాలీ కొనసాగుతుంది.
ఈ ర్యాలీలో జిల్లా రైతు సమన్వయ కర్త పోకల మనోహర్,మునిసిపల్ చైర్మన్ తులసి రాం, నరసింహ గౌడ్,రాజేందర్,కౌన్సిలర్లు,తెరాస నాయకులు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.