తాడూర్ గ్రామంలో చేప పిల్లలు వదిలిన ఎంపీపీ,జడ్పీటీసీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న చేప పిల్లలతో మత్స్యసంపదను పెంపొందించుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని మండల ఎంపీపీ తిప్పర్తి అరుణ,జడ్పీటీసీ అనంత ప్రతాప్ రెడ్డి అన్నారు.గురువారం మండల పరిధిలోని తాడూర్ గ్రామంలో ఇటీవల కేఎల్ఐ సాగునీరు రాకతో చెరువులో చేప పిల్లలు వదిలే కార్యక్రమంలో పాల్గొన్నారు.మండలంలో కేఎల్ఐ సాగునీరుతో ప్రతి చెరువు,కుంటలను నింపి మండలాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఏడి మనిపాల్,సర్పంచ్ అలివేల,ఉప సర్పంచ్ శిరీష,ఎంపీటీసీ శ్యామల,పంచాయతి కార్యదర్శి సురేష్, మత్స్యకారులు పాల్గొన్నారు.