తల్లిపాలే శ్రేష్టం
పుట్టిన బిడ్డకు తల్లిపాలే శ్రేష్టమని ఐసిడిఎస్ సిడిపిఓ దమయంతి సూచించారు.మండలంలోని అంగన్వాడీ కేంద్రాలలో చేపట్టిన పోషణ అభియాన్ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు.ప్రతి గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేయించుకోవాలని ఆమె సూచించారు.తద్వారా ప్రభుత్వం చేపట్టే వివిధ ప్రభుత్వ పథకాలలో భాగస్వాములు కాగలరని ఆమె తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు, ఆశావర్కర్లు,మహిళలు పాల్గొన్నారు.