డీర్‌డీఓలో ఉద్యోగాలు… నేరుగా ఇంటర్వ్యూ
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో-JRF పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇందుకోసం నోటిఫికేషన్ జారీ చేసింది. బెంగళూరులో డీఆర్‌డీఓకు చెందిన ల్యాబరేటరీ ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్-ADE సంస్థ కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వీటికి బెంగళూరులో వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. డీఆర్డీఓ అధికారిక వెబ్‌సైట్ లో దరఖాస్తు చేయాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు అక్టోబర్ 20 చివరి తేదీ. రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి డీఆర్డీఓ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం
మొత్తం ఖాళీలు- 10
రీసెర్చ్ అసోసియేట్- 1
జూనియర్ రీసెర్చ్ ఫెలో- 9
స్టైపెండ్: రీసెర్చ్ అసోసియేట్‌కు నెలకు రూ.54,000, జేఆర్ఎఫ్‌కు నెలకు రూ.31,000. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 సెప్టెంబర్ 30
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 20
రీసెర్చ్ అసోసియేట్ పోస్టుకు ఇంటర్వ్యూ జరిగే తేదీ- 2019 నవంబర్ 6
జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు ఇంటర్వ్యూ జరిగే తేదీ- 2019 నవంబర్ 5, 6
వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే అడ్రస్:
ADE, DRDO,
Raman Gate, Suranjandas Road,
New Thippasandra Post,
Bengaluru- 560075.