డా. ప్రియాంక రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ

అచ్చంపేట పట్టణంలో శుక్రవారం సాయంత్రం నరరూప రాక్షసుల చేతిలో బలైన డా. ప్రియాంక రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి,ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి, ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అంబెడ్కర్ చౌరస్తా నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ తెలంగాణ అమర వీరుల స్థూపం దాకా కొనసాగింది.దోషులను కఠినంగా శిక్షించాలని, ఉరి తీయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యావేత్తలు,పలువురు నేతలు,యువత,విద్యార్థులు,ప్రజలు పాల్గొన్నారు.