టెండర్లను రద్దు చేయాలి
◆టెండర్లను రద్దు చేయాలి◆
SFI జిల్లా ప్రధాన కార్యదర్శి జి. అశోక్
పట్టణంలోని బి.సి.బాలుర గురుకుల పాఠశాలలో కూరగాయలు,పాలు,పండ్లకు వేసిన టెండర్లను రద్దు చేయాలని SFI జిల్లా ప్రధాన కార్యదర్శి జి. అశోక్ డిమాండ్ చేశారు. బుధవారం గురుకుల పాఠశాలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రెండు మూడు రోజులకు ఒకసారి కూరగాయలు వేస్తున్నారని,పండ్లను రెండురోజులకు ఒకసారి అందిస్తున్నారని, కిరాణంను సక్రమంగా అందించడం లేదని ఆయన అన్నారు. టెండర్ల పేరుతో విద్యార్ధులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల నోరు కొడుతున్న టెండర్లను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వెంటనే గురుకులలకు సొంత భవనాలు నిర్మించాలని,సొంత భవనాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా సహాయ కార్యదర్శి రాంబాబు,జిల్లా నేత రాజు,మల్లేష్ లు పాల్గొన్నారు.