టీఆర్‌ఎస్ సెంచరీ
రాష్ట్ర శాసనసభలో టీఆర్‌ఎస్ బలం 100కు చేరింది. టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి బుధవారం చేసిన ప్రకటనతో అధికార పార్టీ అసెంబ్లీలో సెంచరీ పూర్తిచేసినట్లయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున గెలిచిన 88 మంది, ఇద్దరు ఇండిపెండెంట్లు, ఒక టీడీపీ, తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుపుకుంటే గులాబీ పార్టీ బలం వందకు చేరింది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను బుధవారం హైదరాబాద్‌లో కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్ష కలిశారు. అనంతరం కేసీఆర్ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ పక్షాన పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ హర్ష లేఖ విడుదల చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని అందులో తెలిపారు.