జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విఆర్ఓ ల ధర్నా
రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ లోని విఆర్వోల పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా విఆర్వోలు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా లు నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర విఆర్వోల సంఘము పిలుపు ఇచ్చిన నేపథ్యంలో
నేడు నాగర్ కర్నూలు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయడానికి అచ్చంపేట క్లస్టర్లోని విఆర్వోలు తరలి వెళ్లారు.
రెవెన్యూ శాఖలోనే వీఆర్వోలను వ్యవసాయ శాఖకు మార్చాలని ప్రభుత్వం యోచిస్తుండడంతో ఈ ధర్నాకు ప్రాధాన్యత సంతరించుకుంది.
రెవెన్యూ శాఖలో విఆర్వోల పాత్ర క్షేత్రస్థాయిలో కీలకమని, వ్యవసాయ శాఖకు బదిలీ చేసే ఆలోచనలో ప్రభుత్వం పూర్తిగా మానుకోవాలని వారు డిమాండ్ చేయనున్నారు.