జింకపిల్ల అప్పగింత
దారి తప్పిన జింకపిల్ల ఆవ్వుల మందలో కలిసిన ఘటన బల్మూర్ మండలంలో చోటు చేసుకుంది.
బల్మూర్ మండలం మైలారం గ్రామానికి చెందిన పశువుల కాపరి చంద్రయ్య ఆవ్వుల మందతో అడవికి వెళ్లి నిన్న సాయంత్రం తిరిగి వస్తుండగా దారి తప్పిన జింకపిల్ల మందలో కలిసింది.దానితో అతను అచ్చంపేట అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు నాగరాజు,గోపాల్ జింక పిల్లను స్వాధీనం చేసుకున్నారు.జింక పిల్ల అప్పగింత పై అధికారులు గ్రామస్తులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు,వెంకటేష్,శ్రీను,భగవాన్ రెడ్డి పాల్గొన్నారు.