జాతీయ మహిళారత్నం జాతీయ విశిష్టసేవ రత్న అవార్డు అందుకున్న శ్రీమతి ఎం.ధరణి గారు
శ్రీమతి M. ధరణి ‘మహిళారత్న జాతీయ విశిష్ట సేవారత్న పురస్కారం-2019’ జూన్ 9 వ తేదీన ఆదివారం రోజు విజయవాడలో అందుకున్నట్లు తెలిపారు.
ఆదరణాలయం, వేదిక క్రియేటివిటీ కల్చర్ టాలెంట్ వేరియస్ స్కిల్స్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో పలురంగాలో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళలను గుర్తించి వారికి జాతీయ స్థాయిలో ఏటా పురస్కారాలు అందిస్తారు.
విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు,సాహిత్య అకాడమీ రాష్ట్ర సభ్యుడు డాక్టర్ కత్తికొండ ప్రతాప్,రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి పురస్కారాలు అందజేసినట్లు తెలిపారు.
విద్య,ఆధ్యాత్మికం, కళ, సాహిత్యం,సేవ రంగాలలో అందించిన సేవలకు గాను పురస్కారం దక్కినట్లు శ్రీమతి M. ధరణిగారు వెల్లడించారు.
మహిళ ప్రాధాన్యత వివరిస్తూ, పర్యావరణ, గోమాత సంరక్షణకోసం కవితలు, తెలంగాణ అభివృద్ధి వివరిస్తూ కవితలు , యువతను జాగృత పరుస్తూ కవితలు, బ్రహ్మకుమరి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం వారి ‘జ్ఞానమృతం’ పత్రికకు ఆధ్యాత్మిక రచనలు, ఇలా మానవ శ్రేయస్సు కోరుతూ ఎన్నో నా ఉత్తమ రచనలు చేశాను.
నా మొదటి కవతా సంపుటి ‘ చైతన్య వీచికలు ‘ త్వరలో పుస్తకరూపంలో ఆవిష్కరణ కాబోతున్నది.
నా కృషిని గుర్తించి ‘మహిళా రత్న జాతీయ విశిష్ట పురస్కారాలు-2019’ విజయవాడలోని ఆదరణలాయం మరియు వేదిక క్రియేటివిటీ కల్చర్ టాలెంట్ వేరియస్ స్కిల్స్ సొసైటీ వారు ఇచినందుకు వారందరికీ నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను.