జాతీయ నూలి పురుగుల నిర్మూలన దినోత్సవం ర్యాలీ
నేడు జాతీయ నూలి పురుగుల నిర్మూలన దినోత్సవం సంధర్భంగా అచ్చంపేట పట్టణంలో ప్రజలకు నులి పురుగుల నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో 1 నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలకు నులి పురుగుల సమస్య తీవ్రంగా ఉంటుందని, పిల్లలు తీసుకున్న ఆహారాన్ని వారి శరీరానికి అందకుండా ఇవి నిర్వీర్యం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీని ద్వారా పిల్లలకు సరైన పోషక విలువలు అందక బలహీనంగా తయారవుతారని,శరీర ఎదుగుదలను ఇవి నిరోదిస్తాయని అందువల్ల వీటి నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలియజేశారు.పిల్లలకు టీకాలు,మందులు వేయడం ద్వారా నులి పురుగులను పూర్తిగా నిర్మూలించ వచ్చని తెలిపారు.ఈ టీకాలు అన్ని PHC కేంద్రాలలో లభిస్తాయని,తమను సంప్రదించి పిల్లలకు వేయించాలి అన్నారు.
ఈ కార్యక్రమం సిద్ధాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధ్వర్యంలో జరగగా అచ్చంపేటలోని అన్ని PHC లతో పాటు ఆశా వర్కర్లు,హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.