చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రభుత్వం అధికారుల అధ్వర్యంలో బుదవారం పూజలు నిర్వహించారు.
ఈ సందర్బంగా చెన్నకేశవ స్వామి ఇప్పటివరకు కేవలం హరిజనుల ఆలయంగా భావించేవారని ఇకపై ఈ దేవాలయం గ్రామంలోని అందరిదని,గ్రామానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణలోని వివిధ గ్రామాలలో ఆలయాల పై ఉన్న అపోహలు తొలగించి జాతికి అంకితం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ వీఆర్వో లక్ష్మణ్,మాజీ సర్పంచ్ రఘుపతి,కానిస్టేబుల్ రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.