చెంచుపెంటలో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యబృందం

అటవీ ప్రాంతంలోని చెంచుపెంటలో విషజ్వరాలు విజృంబిస్తుడడంతో గురువారం మల్లాపూర్ లో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మోహనయ్య తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వైద్య బృందాలు ఇంటింటికి తిరిగి జ్వరాలతో బాధ పడుతున్న వారిని గుర్తించి, రక్త నమూనాలు సేకరించి, వైద్యం అందించినట్లు ఆయన తెలిపారు.వ్యక్తి గత పారిశుధ్యం మరియు పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవని చెంచులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా నిర్మూళన అధికారి వరప్రసాద్,ఉప మలేరియా అధికారులు అశోక్ ప్రసాద్ మరియు కొట్ర నిరంజన్, ఆరోగ్య సహాయకులు రాజేష్,హన్మంతు పాల్గొన్నారు.