చిట్లంకుంట ముత్యాలమ్మ జాతర
పదర మండలం చిట్లంకుంట
గ్రామంలో ముత్యాలమ్మ జాతర సంబరాలు అంబరాన్ని అంటాయి.వివిధ గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు రావడంతో భక్తజన సంద్రంగా మారింది.కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పు ముత్యాలమ్మ తల్లిని వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి బోనం సమర్పించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఆయన సతీమణి అమల గారు బోనం సమర్పించి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆశీర్వాదం పొందారు.ప్రతి ఏటా జరిగే ఈ ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పూజారి బావోజి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసారు.