చరిత్రలో నేడు నాగసాకి డే(ఆగష్టు 9)
ప్రపంచ చరిత్రలో రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945 వరకు కొనసాగింది.రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో అమెరికా బాంబు దాడి చేసిన రెండవ జపాన్ నగరం నాగసాకి. మొదటి అణుబాంబు
“లిటిల్ బాయ్” హిరోషిమాపై ఆగష్టు 6,1945 న పడిపోగా,నాగసాకి పై దాడి చేసిన “ఫ్యాట్ మ్యాన్” అని నామకరణం చేసిన బాంబు ప్లూటోనియం ఆధారితమైనది.ఇది మూడు రోజుల తరువాత ఆగస్టు 9 న నాగసాకి పై పడిపోయింది.ఈ రెండవ బాంబు హిరోషిమాపై పడిన లిటిల్ బాయ్ కంటే శక్తివంతమైనది అయినప్పటికీ, నాగసాకి యొక్క కొండ భూభాగం కొంతవరకు దానిని రక్షించింది.దీని ప్రభావం ఇప్పటికి దానిపై వుంది, ఖచ్చితమైన మరణాల సంఖ్య తెలియదు కాని సుమారు 75,000 గా అంచనా వేయబడింది.
అనంతరం జపాన్ బేషరతుగా లొంగిపోవడంతో రెండవ ప్రపంచ యుద్ధము ముగింపుకు నాంది పలికింది.
ఆధిపత్యం కోసం జరిగిన ఈ యుద్ధంలో లక్షల మంది సైన్యం అసువులుభాశారు.ఈ యుద్ద అనంతరం జర్మనీ ఆధిపత్యం అంతంకాగా రష్యా,అమెరికాలు అగ్ర రాజ్యాలుగా అవతరించాయి.ఈ యుద్ధం ఆపడంలో విఫలం అవడంతో జెనీవా లోని నానాజాతిసమితి అంతరించి ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది.