గ్రామ రెవెన్యూ సదస్సులు
◆గ్రామ రెవెన్యూ సదస్సులు◆
అచ్చంపేట మండలం లోని వివిధ గ్రామాలలో రెవిన్యూ అధికారులు గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు.
భూ ప్రక్షాళన లో భాగంగా పెండింగ్లో ఉన్న భూముల పై విచారణ తో పాటు వివిధ అంశాలపై ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా మంగళవారం హాజీపూర్ పరిసర ప్రాంతాలలో సదస్సు ఏర్పాటు చేసి భూ సర్వే నెంబర్ ఆధారంగా విచారణ జరిపి భూతగాదాలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మండల పరిధిలో పెండింగులో ఉన్న భూములకు సంబంధించి యాజమాన్య హక్కుల నిర్ధారణ కోసం ఈ విచారణను గ్రామాల వారిగా జరపనున్నారు.
ఇరు వర్గాలు రాజీకి వస్తే వారు సూచించిన వ్యక్తికి భూమి యాజమాన్య హక్కులు కల్పిస్తామని, లేనిపక్షంలో తిరిగి భూ యాజమాన్య హక్కులను పెండింగ్లో ఉంచుతామని
అధికారులు తెలియజేశారు.