గ్రామ అభివృద్దిలో భాగస్వాములవ్వండి
బల్మూర్ మండలం చెన్నారం గ్రామంలో 30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, జిల్లా కలెక్టర్ శ్రీధర్, జడ్పీ చైర్మన్ పద్మావతి పాల్గొని గ్రామంలోని పనులను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా విప్ బాలరాజు మాట్లాడుతూ…ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమంలో అందరు పాలు పంచుకోవాలని ఆయన కోరారు.
కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ… 30 రోజుల గ్రామ ప్రణాళికలో వివిద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలన్నారు. స్వచ్ఛ తెలంగాణాలో అందరూ భాగస్వాముల కావాలని ఆయన పిలుపు నిచ్చారు.