గ్రామాలలో విస్తృత పర్యటనలు చేస్తున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

తెరాస ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 30రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేట గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పల్లెప్రగతి పనులను పరిశీలిస్తూ అధికారులు,ప్రజా ప్రతినిధులకు తగిన సూచనలు చేస్తున్నారు. గురువారం పోలిశెట్టిపల్లి,గుంపన్ పల్లి గ్రామాల్లో అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.
ఆయన వీధుల వెంట జరుగుతున్న పనులు పరిశీలించి తొందరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.