గోవు పలు, పెరుగు, పంచకం, మరియు గో సంబంధిత ఉత్పతులతో క్యాన్సర్ ని జయించవచ్చు.

0

అతనికి తన జీవితం ఒక కల…
27 సంవత్సరాలకే ఎంతో పేరు, ప్రతిష్టలు, ధనం సంపాదించిన ఆ వ్యక్తికి క్యాన్సర్ కారణంగా రోజులు లెక్కబెడుతూ మరణాన్ని చేరుకోవలసిన పరిస్థితి:
అతని పేరు అమిత్ వైద్య. గుజరాతి. US లోనే పుట్టి పెరిగాడు. Ph.D ఎకనామిక్స్. entertainment industry’s business department లో ఉద్యోగం.
‘నేను చురుకైన వ్యక్తినే కాని నా జీవితమంత ఆరోగ్యకరమైన రీతిలో వున్నది కాదు’ అని అమిత్ చెప్పేవాడు.

తన జీవితమంతా కలతలు, విషాదాలతోనే ఎక్కువ నిండివుండేవి. ఎప్పుడయితే తన తండ్రి క్యాన్సర్ కారణంగా చనిపోయారో అప్పటినుండి. ‘నేను నా 27వ ఏట ఉన్నతమైన జీవితంలో వున్నప్పుడు కలిగిన పెద్ద పతనం’ అని అమిత్ చెప్పాడు. తన తండ్రికి సుమారు రెండేళ్లు అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. అతను చనిపోయారు. ఆ తదుపరి తన తల్లికి కూడా క్యాన్సర్. తండ్రి ఎడబాటుకి రెండు నెలల గడువులోనే తల్లి అకాలమరణం అమిత్ ను తీరని విషాదంలోకి నెట్టేశాయి.

‘స్వదేశానికి చాలా దూరంగా బ్రతుకుతున్న నాకు ఇప్పుడు ఒంటరితనం మరింత భారంగా మారింది. ఎందుకంటే నాకు కూడా క్యాన్సర్ వుంది. 18 నెలల క్రితం చేసిన పరీక్షలు వచ్చాయి. ఇప్పుడు క్యాన్సర్ లివర్ కు చేరింది. 9 నెలల తరువాత వచ్చిన రిపోర్టుల్లో 2011 లో క్యాన్సర్ ఊపిరితిత్తులకు వ్యాపించింది’ అంటూ అమిత్ చాలా విచారకంగా తన బాధల్ని ఒకానొక సందర్భంలో వెల్లడించారు.

డాక్టర్స్ చాలా తక్కువ రోజులు మాత్రమే అమిత్ జీవించడానికి అవకాశాలు వున్నాయని తెలిపారు.
‘నేను నా జీవితంలో ఎవ్వరికీ ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకున్నాను. నా అంతిమ క్రియలకు కూడా ఏర్పాట్లు చేసుకున్నాను. చావును స్వాగతించడంలో నాకు భయంలేదు. నా తల్లి నా కళ్లెదురుగా మరణించిన తీరు నాకు చావు పట్ల భయంలేకుండా చేసింది. ఇది ఒక సినిమాటిక్ సందర్భంలా అనిపించవచ్చు. కాని నా తల్లిదండ్రులు నాకు దూరమయ్యాక ఇక వున్న ఈ జీవితం పట్ల నాకు ఎటువంటి ఆసక్తి లేదు’ అని అమిత్ చెప్పాడు.
కాని చనిపోయేముందు ఒక్కసారి భారత్ కు రావాలని నిర్ణయించుకున్నాడు అమిత్. తన తల్లిదండ్రులు భారత్ లో పుట్టి US లో తనువులు చాలించారు. ఇక విదేశంలో పుట్టిన అమిత్ తన స్వదేశంలో చివరి ఊపిరిని వీడాలని నిశ్చయించుకున్నాడు.

భారత్ లో అడుగుపెట్టి అక్కడున్న బంధువులను కలిశాడు. అప్పటికే తీవ్ర అనారోగ్యం అమిత్ ను వెంటాడుతోంది. శరీరం సహకరించని స్థితి. కాని బంధువులంతా వారి వారి జీవిత సమస్యల్లో వున్నారు. అందుకే చేదోడు లభించలేదు. వారి ఇంటి తలుపులు మూసుకున్నాయి.

‘నేను ఢిల్లీలో వున్నప్పుడు కొన్ని ప్రత్యామ్నాయ ఉపాయాలు చెప్పిన నా స్నేహితుడి మాటలు నాకు గుర్తుకు వచ్చాక నాక్కూడా జీవించాలనే ఆశ కలిగింది. ఒకావిడ నాకు కేవలం ఒక్క రూపాయి ఖర్చుతో కూడిన ఆయుర్వేద వైద్య విధానాన్ని పరిచయం చేశారు. ఎలాగూ బ్రతుకుతాను అనే నమ్మకంలేదు. కాని పోయే ముందు బతకడానికి ఒక ప్రయత్నంగా ఇది భావించాను’ అని అమిత్ చెప్పాడు.
అక్కడకి అమిత్ చేరుకున్నాక, యోగ, ధ్యానం వంటివి సాధన చేసాడు. ప్రతి రోజూ ఆవు పాలు, పెరుగు, గోసంబంధిత ఇతర పదార్థాలను సేవించేవాడు.

గోమూత్రమును కూడా తన మెడికేషన్ లో భాగంగా వాడాడు. అది కూడా పరగడుపున. ఇంతకు ముందు చేదు ఇంగ్లీష్ ఔషధాలు వాడిన అతనికి ఇక్కడ గోసంబంధిత పదార్థాలు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఏదో విశ్వాసంతో చేసిన ఈ పని అతడికి పెద్దగా ఫలితం ఇచ్చినట్టు కనిపించకపోయినా అతడు నిరాశపడలేదు.

అయితే కొన్ని రోజలు తరువాత స్కానింగ్ రిపోర్టులు వచ్చాయి. అందులో క్యాన్యర్ వ్యాప్తి నిరోధించబడినట్లు తేలింది. ఇంకో 40 రోజులు అదనంగా ఆయుష్షు పెరిగిందని డాక్టర్లు అంచనా వేశారు. అంతేకాదు అప్పటి వరకు వున్నక్యాన్సర్ కూడా తగ్గుతుందని తేలింది. అంతే అదే గో సంబంథిత ఔషధాలను అమిత్ కొనసాగించాడు. అక్కడే ఒక రైతును ఆశ్రయించి ఒక ఇల్లు తీసుకుని, గోశాల కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అందులో దేశీయ ఆవులను పెంచాడు. ఆ గ్రామస్తులు అతనికి బాగా సహకరించారు.

18 నెలలు గడిచాయి. ఎందరో డాక్టర్లు బ్రతికించలేని తనను ఒక గోవు బ్రతికించింది. తన అంత్యక్రియలను ముందుగానే ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఈ రోజు పూర్తి ఆరోగ్యంతో జీవిస్తున్నాడు. అంతేకాదు తనలాగా క్యాన్సర్ బాధితులకు స్వయం సేవలను అందిస్తున్నాడు. అక్కడా అంతా ఉచితమే. ఆయన స్థాపించిన NGO పేరే “హీలింగ్ వైద్య”.
అతను తిరిగి మళ్లీ US వెళ్లలేదు.

‘భరతమాత, గోమాత నాకు చాలా ఇచ్చాయి. నేను ఇక్కడే వుండాలి’ అని అమిత్ చాలా గర్వంగా చెబుతారు.
అమిత్ రాసిన పుస్తకం Holy Cancer – How A Cow Saved My Life లో చాలా విషయాలు రాశాడు.
ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఒక్క గోవు వుంటేనే క్యాన్సర్ లాంటి మహమ్మారి జయించాడు అమిత్. మరి దేశంలో ప్రతి ఇంటికి గోమాత ఆశీర్వాదం వుంటే ఈ భారత్ ఆరోగ్య భారత్, ఐశ్వర్య భారత్ గా మారుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *