గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
మన్ననూర్ దర్గా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.
స్థానికులు సమాచారాన్ని అందించడంతో సంఘటనా స్థలాన్ని సందర్శించి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని,మృతుడిని అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి తరలించి శవాగారంలో భద్ర పరిచినట్టుగా ఎస్సై పరశురామ్ తెలియజేశారు.
మృతుడి వయసు దాదాపు 50 సంవత్సరాలు ఉంటుందని, అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు, ఒకవేళ ఎవరైనా మృతుడిని గుర్తించినట్లయితే అచ్చంపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఆయన సూచించారు.