గీతాంజలి స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ బోనాల మహోత్సవం

అచ్చంపేట పట్టణంలోని గీతాంజలి స్కూల్ ఆధ్వర్యంలో బోనాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.డప్పుల నడుమ బాలిక అమ్మవారి రూపంలో దర్శనమివగా,
విద్యార్థులు పోతురాజు వేషధారణలో అలరించారు.
గీతాంజలి స్కూల్ విద్యార్థినులు బోనాలు ఎత్తి పట్టణ ప్రధాన కూడళ్ల గుండా తిరుగుతూ పోచమ్మ గుడి వద్దకు చేరి అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ సంస్కృతి, వారసత్వానికి ప్రతీక ఈ బోనాల పండుగ మహోత్సవం అని, విద్యార్థులకు మన సాంప్రదాయలపై పాటు మన సంస్కృతి, వారసత్వం పై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె భరత్ కుమార్ తెలియజేశారు.
ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భరత్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.