గాంధీ జయంతిని పురస్కరించుకుని పండ్ల పంపిణి
గాంధీ జయంతి సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు, ప్రభుత్వ ఆస్పత్రిలోని బాలింతలకు అక్షయ సేవ్ లైఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఇలాంటి మహనీయుల జయంతిని పురస్కరించుకుని పేదలకు, వృద్ధులకు, అనాధలకు పలు సేవా కార్యక్రమాలు అందిస్తామని మరియు అక్షయ సేవ్ లైఫ్ ట్రస్ట్ సేవలు మరింతగా విస్తరింపజేస్తామని ట్రస్ట్ చైర్మన్ మంతటి రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు రాము,భీష్మ తదితరులు పాల్గొన్నారు.