గంజాయి పంటలపై పోలీసుల దాడులు
నల్లమలలో గంజాయి సాగు చేస్తున్న వారిపై పోలీసులు వరుసగా దాడులు చేసి అరెస్ట్ చేస్తున్నారు.మొన్న అచ్చంపేట మండలంలోని చేదురుబావి తండాలో దాడి చేయగా,ఆదివారం పదర మండలం ఇప్పలపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న తోటలపై పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో మిరప పంటలో అంతర పంటగా సాగు చేస్తున్న రెండు ఎకరాల విస్తీర్ణంలోని గంజాయి సాగును స్వాధీనం చేసుకున్నారు.అమ్రాబాద్ సీఐ బీసన్న అధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో అమ్రాబాద్,పదర,ఈగలపెంట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.