కోనేరు సంస్థ ఆధ్వర్యంలో గిరిజన విద్యార్ధులకు అవగాహన
కోనేరు సంస్థ ఆధ్వర్యంలో సేవ్ ది చిల్డ్రన్ వారి సహకారంతో లక్ష్మాపూర్ తండాలో గిరిజనులకు విద్యా హక్కు చట్టం 2009 గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సంస్థ సిసిఓ సురేష్ గౌడ్ మాట్లాడుతూ…విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన అది క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదన్నారు. ఈ చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.అప్పుడే చట్టం అమలు కాకపోతే ప్రశ్నించవచ్చని,కావున విద్యా హక్కు చట్టం పూర్తి స్థాయిలో అమలు అయ్యి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య బాలలకు అందుతుందని అలాగే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు వల్లమ్మ,అలివేలు, విద్యా వాలంటీర్లు హనుమంతు,సాలీ, గ్రామస్తులు పాల్గొన్నారు.