కోతుల దాడి
అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి.సోమవారం ఉపాధ్యాయుని పై దాడి చేసి తీవ్రంగా గాయపరచాయి.వివరాల్లోకి వెళ్ళితే ప్రభుత్వ గిరిజన హాస్టల్లో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న కురుమయ్య సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్తుండగా ఒకసారిగా దాడి చేసి కరచీవేశాయి. దానితో గ్రామస్తులు రక్షించి ఆసుపత్రిలో ప్రాథమిక వైద్యం అందజేశారు.
కోతుల బెడద ఎక్కువ కావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.చేతిలో ఏ వస్తువు ఉన్న లాక్కేలుతున్నాయి.ప్రతిఘటిస్తే దాడి చేస్తున్నాయి.కావున అధికారులు స్పందించి కోతుల బెడద నుండి కాపాడాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.