కొరటికల్ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ
కొరటికల్ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఉప్పునుంతల మండల జడ్పిటిసి అనంత ప్రతాప రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో ఏ ప్రభుత్వం చేయని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను తెరాస ప్రభుత్వం అమలు చేస్తుందని, వాటిని ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.
అనంతరం లబ్ధిదారులకు బతుకమ్మ చీరలు పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరుణ నరసింహ రెడ్డి, ఎంపీటీసీలు అనురాధ రెడ్డి,భూరం మల్లేష్ యాదవ్, గ్రామ సర్పంచ్ రమేష్ రెడ్డి,ఉప సర్పంచ్ కృష్ణయ్య, నాయకులు పాల్గొన్నారు.