కొరటికల్లో 30 రోజుల గ్రామ ప్రణాళిక
ఉప్పునుంతల మండల్ కొరటికల్ గ్రామంలో 30 రోజుల గ్రామ ప్రణాళికా కార్యక్రమంలో భాగంగా పాత ఇల్లు,మట్టి గోడలను కూల్చి చదును చేశారు.అనంతరం ఆ ప్రాంతంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు గుంతలు తీశారు.అనంతరం కొరటికల్ నుండి వెల్టూరు వెళ్లే రహదారిలో ఉన్న పిచ్చి మొక్కలను డోజర్ సహాయంతో తొలగించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జి. రమేష్ రెడ్డి, డిప్యూటీ సర్పంచ్ కృష్ణయ్య,గ్రామ కార్యదర్శి లలిత,ఫీల్డ్ అసిస్టెంట్ రమేశ్,స్పెషల్ ఆఫీసర్ ఖాజా,వార్డు నెంబర్లు పాల్గొన్నారు.