కేజీబీవీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
నడింపల్లి,బల్మూర్ లోని కేజీబీవీ లో ఖాళీగా ఉన్న పోస్టులకు నిరుద్యోగ మహిళా యువత నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ రామారావు ఒక ప్రకటనలో తెలిపారు.
నడింపల్లి కేజీబీవీ లో స్కావెంజర్ పోస్టుకు, బల్మూరులోని కేజీబీవీలో అసిస్టెంట్ కుక్, స్కావెంజర్ పోస్టులకు 18 నుండి 45 సంవత్సరాలలోపు వయసు కలిగిన, పని అనుభవం కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.ఆసక్తి కలిగిన వారు ఈ నెల 12న స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో సాయంత్రం నాలుగు గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని,ఇట్టి పోస్టులకు నెలకు 7500 రూపాయల వేతనం ఇవ్వనున్నట్లు ఆయన తెలియజేశారు.