కె.ఎల్ ఐ సాగునీటి పై సమీక్ష నిర్వహించిన ఎంపీపీ, జడ్పిటిసి
ఉప్పునుంతల మండలంలోని అన్ని గ్రామాల్లోని చెరువులు, కుంటలకు సాగునీరు నింపి రైతులు పంటలు పండించే వాతావరణాన్ని కల్పించే దిశగా పూర్తి స్థాయిలో చెరువులు, కుంటలను నింపాలని ఇరిగేషన్ అధికారులకు ఎంపీపీ, జడ్పిటిసి సూచించారు.ఈ సందర్బంగా కెనాల్ కాలువల మరమ్మతు,పిల్ల కాలువలను సరిచేసి మంజూరైన తూములను నిర్మించి ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలని చెప్పారు.
ఈ కార్యక్రమానికి ఏఈ మరియు వివిద గ్రామాల సర్పంచులు,ప్రజా ప్రతినిధులు, రైతులు హాజరయ్యారు.